విధాత, హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా నిర్మాత భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ కు 28 ఓట్లు రాగా, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ సారి ఎన్నికల బరిలో భరత్ భూషణ్‌తో పాటు, ఠాగూర్ మధు పోటీ చేశారు. కాగా ఫిల్మ్ ఛాంజర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ గెలిచాడు. భరత్ భూషణ్‌ను డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీ చేశారు. ప్రొడ్యూసర్స్ , ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు ఓట్లు వేశారు. ఇక గత ఐదేళ్ల పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కి అధ్యక్షుడిగా దిల్ రాజు ఉండగా.. ఈసారి ఇద్దరు నిర్మాతలు పోటీలో నిల్చున్నారు.
Telugu Film Chamber | తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా నిర్మాత భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు పోలయ్యాయి

Latest News
మిస్ యూనివర్స్ లో ఆ డ్రెస్.. ఫేమస్!
పాక్‌లోకి చొరబడేందుకు ఆంధ్ర యువకుడి యత్నం కారణం విన్న పోలీసులకు షాక్!
చైనీస్ రివర్ డ్రాగన్ చూశారా...రాత్రివేళ జిగేల్
ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో... కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం
నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన
ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్
మాజీ ఐఏఎస్ కు ఐదేళ్లు జైలు శిక్ష