Site icon vidhaatha

Bandi Sanjay | కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌.. Videos

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుటుంబసమేతంగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయనతోపాటు ఆయన కుటుంబసభ్యులంతా వేళ్లపై ఎన్నికల అధికారులు వేసిన సిరా గుర్తులను చూపించారు.

కరీంనగర్‌లో బండి సంజయ్‌పై కాంగ్రెస్‌ పార్టీ వెలిచాల రాజేందర్‌ రావును, బీఆర్‌ఎస్‌ పార్టీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను బరిలో దించింది. ప్రస్తుతం కరీనంగర్‌ సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ ఉన్నారు. కాగా, ఓటు వేయడానికి ముందు బండి సంజయ్‌ కరీనంగర్‌లోని మహాశక్తి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బర్కత్‌పురలో ఓటు హక్కు వినియోగించుకున్నాఆరు. అదేవిధంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ ముషీరాబాద్‌లో ఓటు వేశారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు కూడా హైదరాబాద్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Exit mobile version