విధాత, హైదరాబాద్ : జీవో 46 రద్దు చేసే వరకు బీఆరెస్ పోరాటం కొనసాగుతుందని బీఆరెస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కోన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో 46రద్ధు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జీవో 46బాధితులు తమ బాధ చెప్పుకోవడానికి ప్రజాభవన్ వెళితే పోలీసులతో కొట్టించారని, అరెస్టు కాబడిన బాధితులను పోలీస్ స్టేషన్‌లో పరమార్శించేందుకు వెళితే అడ్డుపడ్డారని విమర్శించారు. జీవో 46బాధితులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పందించ లేదన్నారు. జీవో 46 బాధితుల పక్షాన పోరాడుతామని కేటీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల పాలు చేస్తోందని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఓ తెల్ల కాగితాన్ని జాబ్ క్యాలెండర్ పేరిట అసెంబ్లీలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిందని విమర్శించారు. అయితే జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదని, ఇది జాబ్ క్యాలెండర్ కాదని, జాబులు ఇవ్వలేక జారుకునే క్యాలెండర్ అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై తన మిత్రపక్షం డీఎంకేను చూసైనా నేర్చుకోవాలని సూచించారు. 30 వేల ఉద్యోగాల భర్తీపై దమ్ముంటే కేటీఆర్ రాజీనామా సవాల్‌నుకాంగ్రెస్ నేతలు స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.
Rakesh Reddy | జీవో 46 రద్ధు చేసేదాకా బీఆరెస్ పోరాటం.. బీఆరెస్ నేత రాకేశ్‌రెడ్డి వెల్లడి
జీవో 46 రద్దు చేసే వరకు బీఆరెస్ పోరాటం కొనసాగుతుందని బీఆరెస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కోన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Latest News
నేడు గుజరాత్ టైటాన్స్ జెర్సీ రంగు ఎందుకు మారింది?
పర్యాటకుల ముందే సింహం వేట.. వైరల్ వీడియో
జైలు కెళ్లి చూస్తారా...రూ.1000 స్కీమ్
హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్ .. పోక్సో కేసు కొట్టివేయాలంటూ పిటిషన్
బస్తీ పిల్లల జీవితాలను మార్చిన 17 ఏళ్ల బాలుడు.. 42 మంది తల్లులతో కలిసి ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు!
జూన్ 2నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ: మంత్రి పొంగులేటి
ముందుగా ప్రధాని విమానం అమ్మేయాలి : అవిముక్తేశ్వరానంద
విజయ్ కి ఊరట..ఒక్కడు తగ్గితే 31మంది వచ్చారు!
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు..!