తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు..!

పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ కోరాడు. కేసు దర్యాప్తును సిట్ ముమ్మరం చేయగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి.

మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడన్న ఆభియోగాలతో ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించాడు. పేట్ బషీరాబాద్ పీఎస్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ వేశాడు.

అయితే హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో ఈ పిటిషన్ దాఖలు చేశారు. బండి భగీరథ్ పిటిషన్‌పై ఈ నెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది .

మరోవైపు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. కూకట్‌పల్లి డీసీపీ, ఐపీఎస్ రితిరాజ్ నేతృత్వంలోని సిట్ బృందం పేట్ బషీరాబాద్ పీఎస్‌కు చేరుకుని ఏసీపీ, సీఐ నుంచి కేసు వివరాలు సేకరించింది. డీసీపీ రితిరాజ్ బండి భగీరథ్‌ను ప్రశ్నించనున్నారు. అటు బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మెడికల్ పరీక్షలు ఈ కేసులో కీలకం కానున్నాయని భావిస్తున్నారు. బండి సాయి భగీరథ్ సైతం తనను బాధిత బాలిక కుటుంబం హనీ ట్రాప్ చేశారంటూ కరీంనగర్ టూ టౌన్ లో చేసిన ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడ వారిపై కేసు నమోదైంది.

బీఆర్ఎస్ నిరసనలు

అధికార దుర్వినియోగంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిందితుడైన తన కుమాడు భగీరథ్ ను కాపాడేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు, మహిళా సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ బాధిత బాలికపై అక్రమ కేసు నమోదు చేయించాడని, వెంటనే నిందితుడు భగీరథ్ ను అరెస్టు చేయాలని, విచారణ పారదర్శకంగా జరిగేందుకు బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్, మహిళా సంఘాలు నిరసనలు చేస్తుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

అన్నాడీఎంకేలో చీలిక..సీఎం విజయ్ కి పెరిగిన మద్దతు
Bengaluru Couple | రామసేతు మార్గంలో శ్రీలంక నుంచి భారత్‌కు ఈదుకుంటూ వచ్చిన బెంగళూరు ఐటీ దంపతులు

Latest News