నేరాలు చేసి జైలుకెళ్తే అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో సామాన్యులకు సైతం ప్రత్యక్ష అనుభవం కలిగించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమం చేపట్టింది. రిమాండ్ ఖైదీలు, శిక్షపడిన ఖైదీల పరిస్థితి జైలులో ఎలా ఉంటుంది.. వారికి అందించే సౌకర్యాలపై ఒకరోజు జైలు జీవితం గడిపి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర జైళ్ల శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘ఫీల్ ది జైల్ ’ కార్యక్రమం ప్రారంభమైంది. జైలులో ఒకరోజు అంటే 24గంటలపాటు ఖైదీగా గడిపే వినూత్న కార్యక్రమాన్ని‘ఫీల్ ది జైల్’ పేరుతో చేపట్టింది. ఇందుకోసం ఫీజు రూ. 1000 చెల్లిస్తే 12 గంటలు, రూ. 2 వేలు చెల్లిస్తే 24 గంటలు జైలులో ఉండే అవకాశం కల్పించనున్నారు.
ప్రారంభించిన గవర్నర్
హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆప్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో ఏర్పాటు చేసిన ఫీల్ ది జైల్, మ్యూజియాన్నిగవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. అలాగే జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘జైల్ మ్యూజియం’ను గవర్నర్ ప్రారంభించారు. కారాగారాల చరిత్ర, ఖైదీల సంస్కరణలను ప్రజలకు వివరించేలా దీనిని ఏర్పాటు చేశారు. నిజాం కాలం నాటి నుంచి ఉన్న చంచల్‌గూడ జైలు చరిత్ర, ఆ కాలంలో ఖైదీలకు వేసిన సంకెళ్లు, ఆయుధాలు, ఉరి తీసే తాడు, పాత రికార్డులు వంటి అనేక చారిత్రక విశేషాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
ఈ సందర్భంగా గవర్నర్ శుక్లా మాట్లాడుతూ.. ఓపెన్ జైలు విధానం కూడా మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా కొన్ని సంస్కరణలు చేపట్టానని గుర్తు చేశారు. జైలుకు వచ్చిన ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఖైదీలను పూర్తిగా బంధించి ఉంచాల్సిన అవసరంలేదని, ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పుడే వారిలో మార్పు తీసుకురాగలమన్నారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జైలుకు వెళ్లేందుకు ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..
‘ఫీల్ ది జైల్’ జైలులో ఒకరోజు ఖైదీగా గడపాలనుకునే వారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. జైల్ వెబ్‌సైట్ పోర్టల్‌లో అప్లయ్ చేసుకోవాలి. అప్లికేషన్స్ ఆధారంగా సీరియల్ నెంబర్ ప్రకారం జైలులోకి ఒకరోజు అనుమతిస్తారు. ఇందుకోసం ప్రత్యేక మ్యాన్యువల్‌ను, పాత జైలు పరిసరాల్లో ఏర్పాటు చేశారు. రూ.500 లేదంటే రూ.1000 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించనున్నారు. మొబైల్ ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సందర్శకులతో పాటు అనుమతించరు. ఎంట్రీ గేట్ వద్ద బార్ కోడ్ అనంతరం నిజమైన ఖైదీలు ధరించే దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
బ్యారక్ లోని ఒక గదిలో పడుకోవడానికి చాప, తాగడానికి ఒక గ్లాసు ఇస్తారు. ఉదయం 5గంటలకు నిద్ర లేచి ఎవరి గదిని వారే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. జైలులో నిజమైన ఖైదీలకు అందించిన భోజనమే ఫీల్ ది జైలులో ఉన్నవారికీ కూడా అందిస్తారు. పరిసరాలను శుభ్రం చేసే పనులు అప్పగిస్తారు. ఆ తరువాత సెల్ లో వేసి తాళాలు వేస్తారు. నిబంధనల ప్రకారం.. జైలులో ఒకరోజు పూర్తిగా ఉండలేక మధ్యలో వెళ్లిపోతామంటే మాత్రం రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జైలులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి.. ఖైదీలను ఎలా ట్రీట్ చేస్తారు.. వాళ్లకు ఇచ్చే భోజనం ఎలా ఉంటుంది.. జైలులో ఖైదీలు ఏఏ పనులు చేస్తారు..? వంటి తదితర విషయాలను స్వయంగా సామాన్యులు స్వానుభవంగా తెలుసుకునేందుకు ‘ఫీల్ ది జైల్ ’ మంచి చాన్స్ గా అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :
ముందుగా ప్రధాని విమానం అమ్మేయాలి : అవిముక్తేశ్వరానంద
విజయ్ కి ఊరట..ఒక్కడు తగ్గితే 31మంది వచ్చారు!
