అడవుల్లో వన్యప్రాణులు ఆహారం కోసం ఇతర జంతువులను వేటాడే దృశ్యాలు క్రూరంగా ఉంటాయి. ఓ అభయారణ్యంలో అడవి అందాలను..వన్యప్రాణులను చూసేందుకు వెళ్లిన సందర్శకులకు తమ కళ్లముందే ఓ సింహాలు అడవి జంతువును వేటాడిన అరుదైన దృశ్యాన్ని చూసి ఖంగుతున్న వీడియో వైరల్ గా మారింది.
గుజరాత్ గిర్ నేషనల్ పార్కులో పర్యాటకుల కళ్లముందే జరిగిన సింహాల వేట దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుంది. జంతువు(అడవి ఆవు) రాకను గమనించిన ఆడ సింహం సఫారీ వాహనం వెనుక నుంచి ఒక్కసారిగా దాడి చేయగా, వెంటనే మగ సింహం కూడా దానిపైకి దూకి వేట పూర్తి చేసింది. రెప్పపాటులో జరిగిన ఈ భీకర వేటను చూసి సఫారీ వాహనంలోని పర్యాటకులు విస్మయానికి గురయ్యారు. తమ కళ్ల ముందే జరిగిన సింహాల భీకర వేట దృశ్యాలను సందర్శకులు భయపడుతునే కెమెరాలో బంధించారు. గంభీరమైన ఆసియా సింహాల ఆవాస కేంద్రంగా కొనసాగుతున్న గిర్ నేషనల్ పార్కును ఏటా వేలాది మంది దేశ, విదేశాల పర్యటకులు సందర్శిస్తుండటం విశేషం.
Watch | Viral Video Shows Lioness Hunting in Front of Tourists in Gujarat’s Gir Forest pic.twitter.com/igQWGoL9Ap
— DeshGujarat (@DeshGujarat) May 12, 2026
ఇవి కూడా చదవండి :
Gardens of Hope | బస్తీ పిల్లల జీవితాలను మార్చిన 17 ఏళ్ల బాలుడు.. 42 మంది తల్లులతో కలిసి ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు!
ముందుగా ప్రధాని విమానం అమ్మేయాలి : అవిముక్తేశ్వరానంద
