విధాత, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వీడియోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో టోల్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీతక్క తరఫు న్యాయవాది వెంకటనాయక్ ఫిర్యాదుపై ఐటీఏ-2000-200,79,33 , (4),353(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నప్పుడు, అలాగే పొన్నం ప్రభాకర్‌తో పాటు మరో ఎమ్మెల్యే మాట్లాడుతున్న దృశ్యాలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి ట్రోలింగ్స్ చేశారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఘాటు స్పందించారు. శాసన సభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లు సందర్భంగాను ఈ సమస్యపై అధికార, విపక్ష సభ్యుల మధ్య రచ్చ సాగింది. చట్ట సభల్లో వీడియోలు, ఫోటోలు తీయరాదన్న పార్లమెంటు నిబంధనలను సైతం మంత్రి ఉత్తమ్ చదివి వినిపించారు. సభలో వీడియోలకు సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు. అనంతరం పోలీసులు ఈ వివాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
TELANGANA | మంత్రుల మార్ఫింగ్ వీడియోలపై కేసు నమోదు
