CM Revanth Reddy | విభజన హామీలు.. నిధులు సాధించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రంలో తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్​, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్​, భూపతిరాజు శ్రీనివాస వర్మకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు

  • Publish Date - June 10, 2024 / 01:30 PM IST

కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి అభ్యర్థన

విధాత, హైదరాబాద్ : కేంద్రంలో తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్​, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్​, భూపతిరాజు శ్రీనివాస వర్మకు ట్విటర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు తెలుగు ఎంపీలు కృషి చేయాల్సిందిగా కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురికి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌లకు క్యాబినెట్‌ పదవులు.. బండి సంజయ్​, పెమ్మసాని చంద్రశేఖర్​, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ బెర్తులు దక్కాయి. ప్రస్తుతం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందునా కేంద్ర నుంచి నిధుల సాధనకు ఇదే సరైన సమయమని ఏపీ ఎన్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి. వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినందునా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయన్న ఆశాభావం తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, సమ్మక్క సారమ్మ యూనివర్సిటీ సహా సైనిక్ స్కూళ్లు, నవోదయ స్కూళ్లూ, ఏయిమ్స్‌, మెడికల్ కళాశాలలకు సహకారం వంటి అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఆ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు.

Latest News