CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గుండేటి రాహుల్ కుటుంబం

రైలు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన గుండేటి రాహుల్‌కు కృత్రిమ కాళ్ల సాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబంతో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

cm-revanth-reddy-meets-gundeti-rahul-family-offers-financial-aid

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ తన కుటుంబ సభ్యులతో కలిశారు. 2024 నవంబర్ 2న రైలులో రాజస్థాన్ వెళ్తున్న రాహుల్ ని కొందరు దుండగులు రైల్లో నుంచి తోసేశారు. ఈ ప్రమాదంలో రాహుల్ తన రెండు కాళ్లను కోల్పోయారు.

అతని విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స అందించడంతో పాటు కృత్రిమ కాళ్లను అమర్చేందుకు ఆర్థిక సాయం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబంతో కలిసిన రాహుల్ తను మళ్లీ నడవగలిగేందుకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.