Site icon vidhaatha

TELANGANA | ష‌ర‌తులు వ‌ర్తిస్తాయ్‌…! హ‌రీశ్‌రావు రాజీనామా స‌వాల్‌..!!

పంద్రాగ‌స్టులోపు ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయాల్సిందే..

సంపూర్ణంగా అమ‌లు చేస్తేనే రాజీనామా అంటు మెలిక‌..

అమ‌లు చేయ‌క‌పోతే రేవంత్ రాజీనామా చేయాలంటూ కండిష‌న్‌..

విధాత‌, హైద‌రాబాద్‌:హ‌రీశ్‌రావు మ‌రోసారి రాజీనామా అస్త్రాన్ని తెర‌పైకి తెచ్చాడు. ఆప‌త్కాలంలో, రాజ‌కీయ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కేసీఆర్‌, హ‌రీశ్‌రావుల‌కు ఈ రాజీనామా అస్త్రం ఓ ర‌క్ష‌ణ క‌వ‌చంలా ప‌నిచేస్తూ వ‌చ్చింది. అప్పుడ‌ప్పుడు హ‌రీశ్‌రావు దీన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు మ‌రోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై రాజీనామా అస్త్రాన్ని ప్ర‌యోగించారు. రుణ‌మాఫీ చేయ‌డం మొద‌లుపెట్టామ‌ని రైతుల‌తో కాంగ్రెస్ స‌ర్కార్ సంబురాలు చేసుకుంటున్న త‌రుణంలో.. హ‌రీశ్ త‌న‌దైన శైలిలో సీఎంపై రాజీనామా అస్త్రాన్ని ఎక్కుపెట్టి డిఫెన్స్‌లో ప‌డేయాల‌నే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అది కండిష‌న్ల‌తో కూడుకున్నదిగా ఉండ‌టం గ‌మ‌నార్హం. పంద్రాగ‌స్టులోపు ఆరు గ్యారెంటీలు.. (13 హామీలు) సంపూర్ణంగా అమ‌లు చేయాల‌ని, అలా చేస్తే తాను రాజీనామాకు సిద్ద‌మ‌న్నారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు హ‌రీశ్‌. పంద్రాగ‌స్టులోగా రెండు ల‌క్ష‌ల రుణ‌మాఫే సాధ్యం కాదు. ఆ విష‌యాన్ని ప్ర‌భుత్వ‌మే ఒప్పుకుంటున్న‌ది. ఆగ‌స్టు నెలాఖ‌రులోగా మూడు విడ‌త‌ల్లో పూర్తిగా రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పుకుంటున్న‌ది స‌ర్కార్‌. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్‌రావు విస‌రిన స‌వాల్ పూర్తిగా కండిష‌న్ల‌కు లోబడి ఉన్నాయి. త‌న రాజీనామాకు ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి అనే విధంగా ఈ స‌వాల్ ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Exit mobile version