Site icon vidhaatha

Minister Jupally Krishna Rao | మంత్రి జూపల్లికి సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత

Minister Jupally Krishna Rao | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి (MLA Bandla Krishna Mohan Reddy)ని కాంగ్రెస్‌ (Congress)లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పలువురు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ని అడ్డుకుని నిరసనకు దిగారు. గద్వాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన జూపల్లిని మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత (Saritha) వర్గీయులు అడ్డుకుని బండ్లను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై తమ నిరసన వ్యక్తం చేశారు.

జూపల్లికి, బండ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కాన్వాయ్‌పై రాళ్లు కూడా విసిరినట్లుగా తెలుస్తుంది. పోలీసులు జోక్యం చేసుకుని మంత్రి కాన్వాయ్‌కి అడ్డుతగిలిన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు లాగేసి ఆయనకు భద్రత కల్పించి ముందుకు పంపించారు. ఈ వ్యవహారం గద్వాల జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న విబేధాలను రోడ్డున పడేసింది.

Exit mobile version