అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్
రెండు మూడు రోజుల్లో జీవో
వెల్లడించిన మంత్రి సీతక్క
భూ రిజిస్ట్రేషన్లలలో మహిళలకు 50శాతం రాయితీపై పరిశీలన
విధాత, హైదరాబాద్ : అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నగరంలోని రహమత్ నగర్‌లో జరిగిన ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ టీచర్‌కు రూ. 2లక్షలు, హెల్పర్‌కు రూ. 1లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని ఆమె వెల్లడించారు. దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. అలాగే సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇవ్వాలని, మహిళలు భూ యాజమానులయ్యేలా ప్రొత్సహించాలని మంత్రి సీతక్కకు మహిళా రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని హమీనిచ్చారు. భూమి అంటే ఆర్థిక వనరే కాదు సమాజంలో గౌరవం, అధికారమని పేర్కోన్నారు.
భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీల్లో మహిళలకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.