పత్తి పంట చేతికి రాక.. బ్యాంక్ రుణాలు చెల్లించలేక యువరైతు ఆత్మహత్య

బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడడంతో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు

  • Publish Date - April 8, 2024 / 04:39 AM IST

బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడడంతో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు

విధాత బ్యూరో, కరీంనగర్: బ్యాంకులో తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడడంతో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సంతోష్ యాదవ్ రెండు సంవత్సరాల క్రితం స్వగ్రామమైన లద్నాపూర్ నుండి రత్నాపూర్ గ్రామానికి వచ్చి అక్కడే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 8 ఎకరాల విస్తీర్ణంలో సంతోష్ పత్తి పంట సాగు నూతన గృహ నిర్మాణం, పత్తి పంట పెట్టుబడుల నిమిత్తం బ్యాంకు నుండి 35 లక్షల రుణం తీసుకున్నాడు.పత్తి పంట చేతికి రాగానే బ్యాంకులో రుణం చెల్లించాలని భావించాడు.

నీటి కొరత, తెగుళ్ల కారణంగా ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో, బ్యాంకులో లోన్లు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని భావించి, జీవితంపై విరక్తి చెంది గత (ఏప్రిల్ 3) మంగళవారం మధ్యాహ్నం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే పెద్దపల్లి ఆసుపత్రికి, తర్వాత కరీంనగర్ కు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. చికిత్స జరుగుతుండగానే ఆయన బుధవారం మృతి చెందారు. సంతోష్ భార్య ఉడత స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు రామగిరి పోలీసులు తెలిపారు.

Latest News