Textiles Minister Giriraj Singh : తెలంగాణలో పత్తి కొనుగోలు బాధ్యత సీసీఐదే

తెలంగాణలో ఈ ఏడాది కూడా 100 శాతం పత్తిని కొనుగోలు చేసే బాధ్యత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) దేనని కేంద్ర జౌళి శాఖా మంత్రి గిరి రాజ్ సింగ్ స్పష్టం చేశారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

Textiles Minister Giriraj Singh

న్యూఢిల్లీ : తెలంగాణలో పత్తి పంటను ఈ ఏడాది కూడా 100శాతం కొనుగోలు చేసే బాధ్యత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుందని కేంద్ర జౌళి శాఖా మంత్రి గిరి రాజ్ సింగ్ స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణలో 80 శాతం
పత్తి కేంద్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా 100 శాతం కొనుగోళ్లు చేస్తాం అన్నారు. గత ఏడాది తెలంగాణలో 110 పత్తి కొనుగోలు కేంద్రాలు ఉంటే.. ఈ ఏడాది 122 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం అని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. రైతులు గురించి పట్టించు కోవడం లేదు అని ఆరోపించారు. రైతుల కష్టాలు తెలంగాణ ప్రభుత్వానికి పట్టడం లేదని…ట్రేడర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వేదిక కల్పించాలి కానీ చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడం లేదని..రైతులకు మద్దతుగా లేదు అని విమర్శించారు. కేంద్రానికి సహకరించడం లేదు అని..అందుకు పత్తి కొనుగోలు ప్రక్రయ ఆలస్యమైందన్నారు.