విధాత, హైదరాబాద్: బతుకమ్మ వేడుకల సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన, తెలంగాణ చరిత్ర–సంస్కృతి, పండుగలపైన షార్ట్ ఫిల్మ్స్–పాటల పోటీలు నిర్వహిస్తున్నామని..40 ఏళ్ల లోపు యువ సృజన శీలురు పోటీలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్స్, 5 నిమిషాల పాటలతో ఎంట్రీలు పంపాలని, ఎంట్రీలు youngfilmmakerschallenge@gmail.com లేదా WhatsApp: 8125834009 కు పంపాలని సూచించారు. తుది గడువు: సెప్టెంబర్ 30, 2025 అని తెలిపారు.
పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ.1 లక్ష, కన్సొలేషన్ బహుమతి రూ.20 వేల చొప్పున(ఐదుగురికి) అందిస్తామన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక ప్రదానం చేస్తామని దిల్ రాజు వెల్లడించారు.