Drinking Water | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) మహానగరంలో తాగునీటి సరఫరాకు( Drinking Water Supply ) అంతరాయం కలగనుంది. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరా బంద్ చేయనున్నట్లు జలమండలి( Jalamandali ) అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తాగునీటిని వృథా చేయొద్దని అధికారులు సూచించారు.
అంతరాయం ఎందుకంటే..?
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1 ( Godavari Drinking Water Supply Phase 1 )పథకంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్‌లో 3000 మిల్లీమీటర్ల డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై అమర్చిన 90 ఎంఎం డయా వాల్వుల మార్పిడి పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో ఈనెల 9న ఉదయం 6 గంటల నుంచి 10న ఉదయం 11 గంటల దాకా మరమ్మతులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే 48 గంటలు పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు ఇవే..
ఎఎస్ ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్‌పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంకట్రావ్ నగర్, ఎల్లారెడ్డి గూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు, జూబ్లీహిల్స్ కొంత భాగం, తాటిఖానా కొంత భాగం, లాలాపేట్ కొంత భాగం, తార్నాక కొంతభాగం, కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, భరత్‌నగర్, మోతీనగర్, గాయత్రి నగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హష్మత్‌పేట సెక్షన్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శనగర్, భగత్‌సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్, అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయి నగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథ్‌పురం సెక్షన్, మౌలాలి రిజర్వాయర్, చర్లపల్లి, సాయిబాబానగర్, రాధికా సెక్షన్లు, కైలాసగిరి పాత, కొత్త రిజర్వాయర్ ప్రాంతాలు, హౌసింగ్‌బోర్డు సెక్షన్, మల్లాపూర్ కొత్త భాగం, కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ కొంతభాగం, గచ్చిబౌలి కొంతభాగం, నల్లగండ్ల కొంత భాగం, హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు, పోచారం, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం సెక్షన్, అయ్యప్ప కాలనీ రిజర్వాయర్ ప్రాంతాలు, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం, బౌరంపేట సెక్షన్లు, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హకీంపేట ఎయిర్‌ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఏఐఐఎంఎస్‌బీ నగర్‌లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. దీంతో పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.