విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు అడవి ప్రాంతం నుండి మిర్చి తోటలోకి వచ్చి బీభత్సం సృష్టించడంతోపాటు అక్కడే ఉన్న రైతుపై దాడి చేసింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో రైతు తన మిరప తోట దగ్గర పని చేస్తుండగా బూరేపల్లి అడవి ప్రాంతం నుండి వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన వచ్చిన ఏనుగు మిర్చి పంటను ధ్వంసం చేసింది. భురేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్(50) అనే వ్యక్తి తోటలో పనిచేస్తుండగా మిర్చి పంటను ధ్వంసం చేస్తూ అక్కడే ఉన్న రైతుపై దాడి చేయడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు ఏనుగు జనావసాల్లోకి వచ్చి దాడి చేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు నుంచి భురేపల్లి గ్రామానికి వచ్చిందని ఫారెస్ట్ అధికారులు గ్రామస్థులకుతెలిపారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును మహారాష్ట్ర వైపు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కుమురం భీం జిల్లాలో ఏనుగు దాడి రైతు మృతి
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు అడవి ప్రాంతం నుండి మిర్చి తోటలోకి వచ్చి బీభత్సం సృష్టించడంతోపాటు అక్కడే ఉన్న రైతుపై దాడి చేసింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో రైతు తన మిరప తోట దగ్గర పని చేస్తుండగా బూరేపల్లి అడవి ప్రాంతం నుండి వ్యవసాయ పొలాల్లోకి వచ్చిన వచ్చిన ఏనుగు మిర్చి పంటను ధ్వంసం చేసింది. భురేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్(50) అనే […]

Latest News
బ్యాక్ లెస్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్
రాష్ట్రంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థ
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు అసహనం
రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం : ఈసీ
హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..
తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
అక్కడ లగ్జరీ కార్ల కంటే..గుర్రాలకే ధర ఎక్కువ
రణవీర్ సింగ్ సక్సెస్‌కు వెనక కారణం సంఖ్యాశాస్త్రమా..
యూనెస్కో జాబితాలో దీపావళి ఫెస్టివల్
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం