రాష్ట్రం వచ్చినా..సింగరేణి రాత మారడం లేదు … సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనెని

తెలంగాణ వస్తే మన సింగరేంఇ బొగ్గు గనులు మనకు ఉంటాయని, మన గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని, కాని అందుకు విరుద్ధంగా బొగ్గు గనుల వేలంతో సింగరేణి కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Publish Date - June 26, 2024 / 03:50 PM IST

విధాత, హైదరాబాద్‌ : తెలంగాణ వస్తే మన సింగరేణి బొగ్గు గనులు మనకు ఉంటాయని, మన గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని, కాని అందుకు విరుద్ధంగా బొగ్గు గనుల వేలంతో సింగరేణి కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సింగరేణి దశ తిరుతుందని కలలు కంటే ఇప్పుడు పరి స్థితులు మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని, ప్రైవేటీకరణతో వారంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

సింగరేణి పరిరక్షణకు జూలై 5న బంద్‌..పక్షం రోజుల నిరహార దీక్షలు

సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జూలై 5న బంద్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని, కల్టెరేట్లను ముట్ట డిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలక పోకుండా ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి లేక పోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణిని కాపాడుకోవాలన్నారు. సింగరేణిలేని తెలంగాణను ఊహించుకోలేమని స్పష్టం చేశారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణి వేలంలో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా నిలబడాలని కూనంనేని డిమాండ్ చేశారు.

Latest News