మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలు జారీ కింద పడ్డారు. దీంతో ఆయన ఎడమ కాలి తుంటిబాగంలో తీవ్రంగా గాయమైంది.

  • Publish Date - December 8, 2023 / 03:03 AM IST

విధాత : మాజీ సీఎం కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ బాత్రూంలో కాలు జారిపడి గాయపడ్డారు. ఆయనకు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ తుంటి ఎముక దగ్గర గాయమైందని, ఎడమ కాలుకు తీవ్ర గాయమైందని యశోద వైద్యులు తెలిపారు.