Former Naxalite Murder : మాజీ నక్సలైట్ ప్రాణం తీసిన యూ ట్యూబ్ చానల్ ఇంటర్య్వూ

మాజీ నక్సలైట్ నర్సయ్య యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించిన నిజం ప్రాణం తీసింది. అజ్ఞాతంలో సంతోష్ తండ్రిని చంపినట్లు చెప్పడంతో పగ తీర్చుకున్న కొడుకు.

Ballepu Siddayya Narsayya

విధాత: అజ్ఞాత వాసంలో కొనసాగిన సమయంలో పార్టీ నిర్ణయం మేరకు ఓ వ్యక్తిని హత్య చేసిన మాజీ నక్సలైట్..జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఇచ్చిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్య్వూ అతని ప్రాణం తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

తంగళ్లపల్లి (మం) గండిలచ్చపేటకు చెందిన నర్సయ్యను సంతోష్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. నరసయ్యను హత్య చేసిన తరువాత నిందితుతు సంతోష్ జగిత్యాల పోలీసులకు లొంగిపోయాడు. హత్య కేసు విచారణలో వెలుగు చూసిన అంశాలు సంచలనంగా మారాయి. మాజీ నక్సలైట్ నర్సయ్య హత్యకు అతను లొంగిపోయాక ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూ కారణమైంది. నర్సయ్య తాను అజ్ఞాతంలో(నక్షలైట్‌గా) ఉన్నప్పుడు సంతోష్ తండ్రిని చంపినట్లు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ తన తండ్రిని చంపిన నర్సయ్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నర్సయ్య దారిలోనే వెళ్లి అతడికి పథకం మేరకు హత్య చేశాడు. యూ ట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ కావాలని నమ్మించి పథకం ప్రకారం అగ్రహారం గుట్టలకు నర్సయ్యను పిలిపించాడు. అక్కడ నర్సయ్యను సంతోష్ దారుణంగా హతమార్చాడు.

ఇవి కూడా చదవండి :

AI Teacher Robot : ఇంటర్ విద్యార్థి క్రియేషన్..రూ.25వేలతోనే ఏఐ రోబో!
Viral Video : ఏం మింగిందో…భారీ పొట్టతో కొండ చిలువ అవస్థలు!

Latest News