Holidays | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ), రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోని విద్యాసంస్థలకు( Educational Institutions ), పలు కార్యాలయాలకు 17న సెలవు( Holidays ) ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వినాయక చవితి( Vinayaka Chavithi ) ఉత్సవాలు 17న నిమజ్జనం( Ganesh Immersion )తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులకు, ఉద్యోగులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో సెలవు ప్రకటించారు.
ఇక నిమజ్జనంతో కలిపితే నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లు. ఎలా అంటే.. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం. ఇక సోమవారం(సెప్టెంబర్ 16) మిలాద్ నబీ( Milad un-Nabi )( ముస్లింల పండుగ) కారణంగా పలు విద్యాసంస్థలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మంగళవారం నిమజ్జనం. ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ఈ మూడు జిల్లాల విద్యార్థులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.