హైదరాబాద్ : జీహెచ్ఎంసీ( GHMC ) మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy ) తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. తెలంగాణ(Telangana ) తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) తీర్థం త్వరలోనే పుచ్చుకుంటానని తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) సీఎం చంద్రబాబు( CM Chandrababu )తో భేటీ ముగిసిన అనంతరం తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్( Hyderabad ) అభివృద్ధి చెందింది అని తెలిపారు. తెలంగాణలో టీడీపీకీ భారీగా అభిమానులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
తీగల కృష్ణారెడ్డి గతంలో హుడా ఛైర్మన్గా, హైదరాబాద్ నగర మేయర్గా, ఎమ్మెల్యేగా పని చేశారు. 2014లో బీఆర్ఎస్( BRS Party )లో చేరారు. 2024, ఫిబ్రవరిలో కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తీర్థం పుచ్చుకున్నారు. తీగల కృష్ణారెడ్డి కోడలు, రంగారెడ్డి జడ్పి చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి( teegala Anitha Reddy ) కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.