Site icon vidhaatha

Govt Holidays | 2025లో ప్ర‌భుత్వ సెలువులు ఇవే.. శ‌ని, ఆదివారాల్లోనే జ‌న‌ర‌ల్ హాలీడేస్ అధికం..!

Govt Holidays | 2025 ఏడాదికి గానూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం( Telangana Govt ) సెలవుల‌ను( Govt Holidays ) ఖ‌రారు చేసింది. మొత్తం 27 సాధార‌ణ సెలవులు( General Holidays ), 23 ఐచ్ఛిక సెల‌వుల‌ను( Optional Holidays ) ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సెల‌వుల‌ను ఖ‌రారు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. వ‌చ్చే ఏడాది సెలవుల‌ను గ‌మ‌నిస్తే.. అక్టోబ‌ర్ 2న విజ‌య‌ద‌శ‌మి( Vijayadasami ), 20న దీపావ‌ళి( Deepavali ) సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇక శ‌ని, ఆదివారాల్లోనే జ‌న‌ర‌ల్ హాలీడేస్ అధికంగా ఉన్నాయి. కాబ‌ట్టి ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర నిరుత్సాహ ప‌డుతున్నారు.

జనవరి 1న సాధారణ సెలవు ప్రకటించినందున, ఫిబ్రవరిలో రెండో శనివారం పనిరోజుగా ఉంటుందని జీవోలో ప్ర‌భుత్వం పేర్కొంది. మొత్తం 23 ఐచ్ఛిక సెలవుల్లో ఉద్యోగులు గరిష్ఠంగా ఐదు తీసుకోవచ్చునని చెప్పారు. వచ్చే ఏడాది మొత్తంగా చూసుకంటే జనరల్​ హాలిడేస్​, ఆప్షనల్​ సెలవుల్లో ఎక్కువగా జనవరి నెలలోనే సెలవులు మంజూరు అయ్యాయి.

2025 ఏడాదిలో సాధార‌ణ‌ సెల‌వులు ఇవే..

జ‌న‌వ‌రి 1 – న్యూ ఇయ‌ర్
జ‌న‌వ‌రి 13 – భోగి
జ‌న‌వ‌రి 14 – సంక్రాంతి
జ‌న‌వ‌రి 26 – రిప‌బ్లిక్ డే
ఫిబ్ర‌వ‌రి 26 – మ‌హా శివ‌రాత్రి
మార్చి 14 – హోలీ
మార్చి 30 – ఉగాది
మార్చి 31 – రంజాన్
ఏప్రిల్ 1 – ఫాలోయింగ్ డే ఆఫ్ రంజాన్
ఏప్రిల్ 5 – బాబు జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి
ఏప్రిల్ 6 – శ్రీరామ‌న‌వ‌మి
ఏప్రిల్ 14 – అంబేద్క‌ర్ జ‌యంతి
ఏప్రిల్ 18 – గుడ్ ఫ్రైడే
జూన్ 7 – బ‌క్రీద్
జులై 6 – మొహ‌ర్రం
జులై 21 – బోనాలు
ఆగ‌స్టు 15 – స్వాతంత్ర్య దినోత్స‌వం
ఆగ‌స్టు 16 – శ్రీకృష్ణాష్ట‌మి
ఆగ‌స్టు 27 – వినాయ‌క చ‌వితి
సెప్టెంబ‌ర్ 5 – ఈద్ మిలాద్ న‌బీ
సెప్టెంబ‌ర్ 21 – బ‌తుక‌మ్మ ప్రారంభం
అక్టోబ‌ర్ 2 – గాంధీ జ‌యంతి, విజ‌య ద‌శ‌మి
అక్టోబ‌ర్ 3 – ఫాలోయిండ్ డే ఆఫ్ ద‌స‌రా
అక్టోబ‌ర్ 20 – దీపావ‌ళి
న‌వంబ‌ర్ 5 – కార్తీక పూర్ణిమ‌, గురునాన‌క్ జ‌యంతి
డిసెంబ‌ర్ 25 – క్రిస్మ‌స్
డిసెంబ‌ర్ 26 – బాక్సింగ్ డే

Exit mobile version