Site icon vidhaatha

ఇంచార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో గ్రేటర్ ఎమ్మెల్యేల భేటీ

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి

విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి డి. శ్రీధర్‌బాబును శనివారం గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన బీఆరెస్‌ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిలు కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు మంత్రికి అందజేశారు. జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు ఇవ్వలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకారం అందించాలని అభ్యర్థించారు

Exit mobile version