హైదరాబాద్ : రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేశారు. ఇక పరీక్షకు హాజరయ్యే వారు బూట్లు ధరించకూడదు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి.
జూన్ 1న గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
