జంటనగరాల్లో భారీ వర్షం .. లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్ జామ్‌

హైదరాబాద్‌, సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి

  • Publish Date - June 17, 2024 / 07:13 PM IST

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌, సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, లకిడీకపూల్‌, అమీర్ పేట్‌, రాజేంద్రనగర్, అత్తాపూర్, ఎస్సార్ నగర్‌, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌజ్‌, గండిపేట్, శివరాంపల్లి, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, బీఎన్ రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్, ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్ పల్లి, జేఎన్‌టీయూ, నిజాంపేట్, లింగంపల్లి బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. టోలిచౌక్ గోల్కొండ ఎండి లైన్స్ లో 200 సంత్సరాల చెట్టు ఈదురుగాలులకు నేలకొరిగింది. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తికి తల పై గాయాలు అయ్యాయి. 4 బైక్స్ ధ్వంసమయ్యాయి.

ఈ నెల 23 వరకు తెలంగాణలో వానలు

ఈనెల 23వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గాలులతో వర్షం కురుస్తుందని తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, ఈ నెల 18 నుంచి 24న ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మంతో పాటు పలు జిల్లాలతో పాటు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Latest News