విధాత:ప్రత్యక్ష బోధనకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దు: హైకోర్టు.ప్రత్యక్ష తరగతులు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దు.ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దు.ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు.ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలి.వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖకు ఆదేశం.పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలి.గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే.గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని హైకోర్టు ఆదేశం.గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం.ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్య.