Karnataka |
విధాత: కర్ణాటక రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు రాజ్యంగ పీఠికను చదువడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం ప్రార్ధనల్లో తప్పనిసరిగా రాజ్యంగ పీఠికను చదువాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ సమీపంలో రాజ్యంగ పీఠికను చదివారు. అంతర్జా తీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం సహా డిప్యూటీ సీఎం డికె. శివకుమార్, మంత్రు లు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హెచ్‌సి మహదేవప్ప మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పౌరులదంరికి ఇచ్చిన బహుమతి భారత రాజ్యంగం అని, అది న్యాయం, సమానత్వం గురించి నొక్కి చెప్పే పవిత్ర గ్రంథమని అన్నారు. పీఠిక చదడం ద్వారా ఏ పునాదులపై మన దేశం నిర్మితమైందో విద్యార్ధులంతా తెలుసుకునే వీలుందన్నారు.
మన రాజ్యంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను పౌరులు నిర్వర్తించాలన్నారు. అందుకే పాఠశాలల్లో , కళాశాలల్లో రాజ్యంగ పీఠికను చదువడం తప్పనసరి చేశామన్నారు. తద్వారా పిల్లలకు రాజ్యంగ విధుల గూర్చి తెలుస్తాయన్నారు. ఏ ఆదర్శాలు, సూత్రాలు, లక్ష్యాల ఆధారంగా రాజ్యాంగం రూపొందించారో వారికి అవగాహాన వస్తుందన్నారు.