37 Maoist Surrender : మావోయిస్టు పార్టీకి భారీ షాక్..ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా 37మంది లొంగుబాటు

టీఎస్ డీజీపీ ఎదుట రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, రమేష్ సహా 37మంది మావోయిస్టులు లొంగిపోయారు. భారీగా ఆయుధాలు స్వాధీనం కావడంతో కేసు పెద్ద సంచలనం రేపింది.

DGP Shivdhar Reddy

విధాత, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు సమ్మయ్య అలియాస్ ఆజాద్, ఎర్ర, మావోయిస్టు పార్టీ సాంకేతిక విభాగం ఇన్ చార్జీ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ సహా 37మంది డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 25మంది మహిళలు ఉన్నారని..వీరంతా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జన జీవన స్రవంతిలో కలిసినట్లుగా డీజీపీ తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, 303 రైఫిల్, జీ 3 రైఫిల్, ఎస్ఎల్ఆర్, ఏకే 47 రైఫిల్, బుల్లెట్స్, క్యాట్రీడ్జ్ లు సీజ్ చేసినట్లుగా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు నగదుతో పాటు ఇతర పునరావాస సహాయం అన్ని కూడా అందిస్తామని డీజీపీ తెలిపారు.

Latest News