Site icon vidhaatha

Hyderabad | బోయిన్‌పల్లిలో దారుణం.. భార్య, బిడ్డను హత్య చేసి ఆత్మహత్య

విధాత, హైదరాబాద్ : అనుమానంతో కట్టుకున్న భార్యను, 10నెలల కన్నబిడ్డను హత్య చేసిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ బోయినపల్లిలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాంథేడ్‌కు చెందిన గణేశ్, స్వప్న దంపతులు బోయిన్ పల్లిలోని ఆర్యసమాజ్ వద్ద నివాసం ఉంటున్నారు. గణేశ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. మూడవ సంతానంగా ఉన్న 10నెలల కూతురు నక్షత్ర తనకు పుట్టలేదన్న అనుమానంతో తరుచు భార్యతో గొడవ పడేవాడు.

అనుమానం పెనుభూతమై ఆదివారం తెల్లవారుజామున భార్య, కుమార్తెను గొంతు నులిమి చంపేసిన గణేశ్ బేగంపేట రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

Exit mobile version