ACB Raids Electricity Department Officer’s Residence | విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు..2కోట్లకు పైగా నగదు..భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు, రూ.2కోట్ల నగదు, బంగారం స్వాధీనం. అవినీతి ఆరోపణలపై పలు జిల్లాల్లో దాడులు కొనసాగుతున్నాయి.

Hyderabad ACB Raids

విధాత, హైదారబాద్ : హైదరాబాద్ మణికొండ విద్యుత్ శాఖ సర్కిల్ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలలో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. రూ.2 కోట్ల రూపాయల నగదు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు భారీగా పట్టుబడిన బంగారం విలువలను లెక్కిస్తున్నారు. ఏసీబీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో అంబేద్కర్ నివాసంతో పాటు బినామీలు, బంధువుల ఇళ్లో ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది.

ఏడీఈ అంబేద్కర్‌పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు చేపట్టింది. తనిఖీల్లో ఇప్పటికే సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి, మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయని..సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.

Latest News