విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మికుమార్ ఇంట్లో ఏసీబీ దాడులు చేపట్టింది. హైదరాబాద్ లో కుమార్ నివాసం మల్లాపూర్ తో పాటు అతని బంధువుల నివాసాలలో ఏకకాలంలో 8 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ దాడుల్లో ప్రాథమికంగా ఇప్పటికే రూ. 100కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. ఇంట్లో కుప్పలుగా ఉన్న నగదు నిల్వలను చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు.
ఇంట్లో రూ.1.10కోట్ల నగదు గుర్తించి..నగదు నిల్వల కోసం కౌంటింగ్ మిషన్లు తెప్పించారు. కిలో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదులో మూడు ఫ్లాట్లు, ఆరు ఓపెన్ ప్లాట్లు, నిజామాబాద్ లో మూడు ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ అధికారి మజీద్ అలిఖాన్ ఆధ్వర్యంలోని బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
