National Herald case| నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును విచారించడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ కేసులో వారిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారికి న్యాయపరంగా ఊరట లభించినట్లయ్యింది.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లకు నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో ఊరట(relief) దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును విచారించడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది(ED case dismissed). ఈ కేసులో వారిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో వారికి న్యాయపరంగా ఊరట లభించినట్లయ్యింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం లేదా PMLA కింద దాఖలు చేసిన ఫెడరల్ ఏజెన్సీ ఫిర్యాదును మొదటి సమాచార నివేదిక లేకుండా విచారించలేమని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (PC చట్టం) విశాల్ గోగ్నే స్పందిస్తూ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ED దాఖలు చేసిన ఫిర్యాదుకు విచారణ అర్హత లేదన్నారు. ఈ కేసు బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేశారన్నారు.ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈ కేసులో ఇప్పటికే FIR నమోదు చేసిందని. ఈ దశలో ఈడీ అభియోగాల విచారణ సరికాదని పేర్కొంది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారీలను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిందితులుగా చేర్చింది.

నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్తలు అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తులను యంగ్ ఇండియన్ అనే కంపెనీ మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ‘నేర ఆదాయం’ అక్రమంగా మారిందని ED ఆరోపించింది, దీని విలువ ₹2,000 కోట్లకు పైగా ఉంటుందని ఈడీ పేర్కొంది. గాంధీలు సంస్థలో మెజారిటీ వాటాదారులుగా పేర్కొనబడ్డారని, AJL ఆస్తులను చట్టవిరుద్ధంగా పొందేందుకు నేరపూరిత కుట్ర కింద AJL వాటాలను యంగ్ ఇండియన్‌కు బదిలీ చేశారని ED అభియోగాలు మోపంది. వాటాల విలువ, AJL స్థిరాస్తులు, వాటి నుండి వచ్చే అద్దె ED కేసులో నేరపూరిత మార్గాల ద్వారా వచ్చినట్లుగా ఈడీ పేర్కొంది.

Latest News