Keerthy suresh | 9 నెలల్లో 10 కేజీలు తగ్గిన కీర్తి సురేష్.. సర్జరీతో కాదు, అసలు సీక్రెట్ ఇదే!

Keerthy suresh | స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించారు. బరువు తగ్గడానికి సర్జరీలు చేయించుకుందంటూ వచ్చిన పుకార్లకు ఆమె గట్టిగా సమాధానం ఇస్తూ, క్రమశిక్షణతో కూడిన డైట్, వర్కౌట్స్ ద్వారానే 10 కేజీలు తగ్గానని తెలిపారు.

Keerthy suresh | స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించారు. బరువు తగ్గడానికి సర్జరీలు చేయించుకుందంటూ వచ్చిన పుకార్లకు ఆమె గట్టిగా సమాధానం ఇస్తూ, క్రమశిక్షణతో కూడిన డైట్, వర్కౌట్స్ ద్వారానే 10 కేజీలు తగ్గానని తెలిపారు.

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుని నటిగా తన స్థాయిని మరింత పెంచుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాల కంటే ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆమె బరువు తగ్గిన తర్వాత సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు, పుకార్లు వినిపించాయి.

తాజాగా తన ఫిట్‌నెస్ జర్నీ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో కీలక మలుపు తీసుకొచ్చిన ‘మహానటి’ సినిమా తర్వాత దొరికిన చిన్న విరామ సమయంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అప్పటివరకు వ్యాయామాలపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, ఆ సమయంలో తన జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

అవి పాటించాను..

బరువు తగ్గడం వెనుక ఎలాంటి సర్జరీలు లేదా ఇతర షార్ట్‌కట్ పద్ధతులు లేవని కీర్తి స్పష్టం చేశారు. ఇందుకోసం తాను హై ప్రోటీన్ – లో కార్బ్ డైట్ ను కచ్చితంగా పాటించినట్లు చెప్పారు. కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటూ, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కఠినమైన ఫిట్‌నెస్ రొటీన్‌ను అనుసరించినట్లు వెల్లడించారు.

అంతేకాదు, ఆమె హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT), కార్డియో వ్యాయామాలను కూడా తన రోజువారీ జీవితంలో భాగం చేసుకున్నారు. ఇలా క్రమశిక్షణతో సాగిన ఫిట్‌నెస్ ప్రయాణంలో కేవలం తొమ్మిది నెలల్లోనే 10 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బాడీ షేమింగ్‌పై కామెంట్స్..

తనపై వచ్చిన సర్జరీ పుకార్ల గురించి కూడా కీర్తి భావోద్వేగంగా స్పందించారు. “కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు లావుగా ఉన్నానన్నారు. ఇప్పుడు సన్నబడిన తర్వాత బలహీనంగా ఉన్నానంటూ, సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఒకరి శరీరాకృతిపై తీర్పులు ఇవ్వడాన్ని తగ్గించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక ప్రస్తుతం యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్ రెండింటినీ సమతుల్యంగా కొనసాగిస్తున్నట్లు కీర్తి చెప్పారు. మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వానికి ఈ జీవనశైలి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. ఒకప్పుడు వర్కౌట్స్ అంటే ఆసక్తి లేకపోయినా, ఇప్పుడు అవి తన జీవితంలో విడదీయలేని భాగంగా మారాయని పేర్కొన్నారు.

తన ఫిట్‌నెస్ ప్రయాణం ద్వారా కీర్తి సురేష్ ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. పుకార్లను నమ్మకుండా, సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే ఎవరైనా తమ ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవచ్చని ఆమె నిరూపించారు.

Latest News