Mega Job Mela | నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ రంగంలో జాబ్ సంపాదించలేని వారికి ఇదొక సువర్ణావకాశం. ప్రయివేటు రంగంలోని కంపెనీల్లో ఉద్యోగం చేయాలనుకునేవారికి, స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశం. నిరుద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మే 19న హైదరాబాద్ నగరంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఎర్రగడ్డ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి సమీపంలోని విక్టరీ గార్డెన్ ఫంక్షన్ ప్లాజాలో మంగళవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనుంది. ఈ జాబ్ మేళాలో ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ అండ్ ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటి కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఆఫర్‌ను కూడా ప్రకటిస్తున్నాయి.
జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి. పది ఒరిజినల్ మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవసరమైతే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించొచ్చు.
