ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ట్రాఫిక్ మళ్లింపులు – ప్రజలకు పోలీసుల సూచన

హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలు దారిమళ్లింపులపు ప్రకటించారు. భారీ రద్దీ అంచనా వేస్తూ ప్రత్యేక పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేశారు.

Poster of Khairatabad Ganesh 2025 featuring the 69-foot clay idol “Sri Vishwashanti Maha Shakti Ganapathi” with multiple arms, flanked by images of Sri Jagannatha Swamy, Sri Lalita Tripurasundari, Sri Lakshmi Sameta Haiyagreeva Swamy, and Sri Gajjalamma. The design highlights the 71st year celebrations of the Khairatabad Ganesh festival.

హైదరాబాద్‌: ప్రతి సంవత్సరం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశ్ ఈసారి కూడా అత్యంత వైభవంగా ప్రతిష్ఠించబడుతున్నాడు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో, ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’ అవతారంలో భక్తుల ముందుకు 27న ప్రారంభమయ్యే ఉత్సవాలు ప్రతి రోజూ రద్దీని పెంచుతూనే ఉంటాయి. ఇక గణేశ చతువినాయక చవితి నాడు, నవరాత్రి సెలవులు, ఆదివారాలు, నిమజ్జన సమయాల్లో రద్దీ భారీగా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 ట్రాఫిక్ ళ్లింపులు

భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే పలు రూట్లను మూసివేసి దారిమళ్లింపులు అమలు చేస్తున్నారు.

ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి జంక్షన్, మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ, సైఫాబాద్ పాత పోలీస్‌స్టేషన్ ప్రాంతాల్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉండనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం, సెలవు దినాల్లో వాహనాల రాకపోకలు మరింత కష్టతరం కానున్నాయి.

పార్కింగ్ ఏర్పాట్లు

భక్తుల సౌకర్యం కోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్, ఎన్‌టీఆర్ గార్డెన్, సరస్వతి విద్యామందిరం హైస్కూల్, రేస్ కోర్స్ రోడ్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు.

లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాలతో మండపం చుట్టూ 24 గంటల పర్యవేక్షణ, ప్రత్యేక పహారా విధులు అమలులో ఉంటాయి. ట్రాఫిక్ నిర్వహణ కోసం అదనపు కానిస్టేబుళ్లను నియమించారు. GHMC, RTC, మెట్రో సంస్థలతో కలిసి భక్తుల రాకపోకలకు సౌకర్యం కల్పించే చర్యలు చేపట్టారు.

భక్తులు వీలైనంతవరకు వ్యక్తిగత వాహనాల బదులు మెట్రో, RTC బస్సులు వినియోగించాలని పోలీసులు సూచించారు. భక్తులకు లైవ్ దర్శనం కోసం ఆన్‌లైన్ సౌకర్యం కూడా కల్పించారు. నిమజ్జన రోజున హుస్సేన్ సాగర్ పరిసరాల్లో రోడ్ల మూసివేత, భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే పౌరులు తమ ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్లైన్ 9010203626 ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.