IAS Amrapali | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )కి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏరికోరి తెచ్చుకున్న ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలి( Amrapali )ని ఆంధ్రప్రదేశ్ కేడర్( Andhra Pradesh Cadre )కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమ్రపాలితో పాటు మరో ఐఏఎస్ ఆఫీసర్ రొనాల్డ్ రోస్( Ronald Rose )ను కూడా ఏపీ కేడర్‌కు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ ఆ కాపీలను తెలంగాణ( Telangana ), ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ప్రభుత్వం బుధవారమే పంపించింది. ఈ ఇద్దరు ఐఏఎస్‌లో వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఆమ్రపాలి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్కు జెన్‌కో, ట్రాన్స్‌కో అదనపు బాధ్యతలను అప్పగించింది.