విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. బుధవారం తుది వాదనలు వింటామని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కవిత తరపు లాయర్ కోరారు. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. మరోవైపు తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డికి ఢిల్లీకి చేరు