విధాత: తెలంగాణలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల కోలాహలం సాగుతుండగా, ఇంకోవైపు ఐటీ దాడుల కలకలం కొనసాగుతుంది. హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా వరుసగా ఐటీ సోదాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు టార్గెట్‌గా ఐటీ సోదాలు జరగ్గా సోమవారం ప్రముఖ ఫార్మా కంపెనీ పైన ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది.15 చోట్ల ఏకకాలంలో ఐటీ బృందాలు సోదాలు చేపట్టాయి.
ఫార్మా కంపెనీ యజమాని ఇల్లుతోపాటు కార్యాలయాలు, సిబ్బంది, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఫార్మా కంపెనీ చైర్మన్ సీఈవో, కంపెనీ డైరెక్టర్‌ల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నాగులపల్లి, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్ పటేల్‌గూడ, గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలలో సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్మాకంపనీలపై ఐటీ దాడుల్లో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తుంది.