విధాత, జనగామ :
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జనగామ మండలంలోని ఛీటకోడూరు, చౌడారం, మరిగడి గ్రామంలో నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోమ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు జనగామ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి ప్రేమలత రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్ మారబోయిన పాండు, బిఆర్ఎస్ జనగాం పట్టణం యూత్ ప్రెసిడెంట్ ఉల్లెంగుల సందీప్ , బీఆర్ఎస్ జనగామ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి, రైతు సమితి మండల అధ్యక్షులు బురెడ్డి ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎడ్ల శ్రీనివాస్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త మన బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
