దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. విశాఖపట్నం – లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12805) ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని, రాత్రి 7.40 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుందని పేర్కొంది.
తిరుగు ప్రయాణంలో లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806) బుధవారం నుంచి ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు. లింగంపేటలో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి బేగంపేటకు 6.38 గంటలకు, ఉదయం 7 గంటలకు చేరుకుంటుందని.. మరుసటిరోజు రాత్రి 7.40 గంటలకు విశాఖపట్నం చేరుతుందని రైల్వే అధికారులు వివరించారు. దాంతో పాటు విశాఖపట్నం – మచిలీపట్నం (17219) ఎక్స్‌ప్రెస్ రైళ్లను సైతం మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.