Maganti Sunitha| జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కేసు నమోదు

జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్‌ మీడియా సెల్ చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి ఆర్‌వోకు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)పై బోరబండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్‌ మీడియా సెల్ చైర్మన్‌ సామ మోహన్‌రెడ్డి(Sama Mohan Reddy) ఆర్‌వోకు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉండే ఓటర్‌ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారని సామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాగంటి సునీతపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం విమర్శలు, హామీలలోనే కాకుండా.. ఒకరిపై మరొకరు ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదుల విషయంలోనూ పోటీ పడుతున్నాయి.