Jubilee Hills vote theft issue| జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ చోరీ!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు చోరీ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతుంది. నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడా బూత్ నంబర్ 246లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదవ్వడం..ఓటర్ జాబితాలో కనిపిస్తుండటం వివాదస్పదంగా మారింది.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills byelection) ఓటు చోరీ వ్యవహారం(vote theft issue) రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతుంది. నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడా బూత్ నంబర్ 246లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదవ్వడం..ఓటర్ జాబితాలో కనిపిస్తుండటం వివాదస్పదంగా మారింది. ఈ వ్యవహారాన్ని యూసుఫ్ గూడా బీఆర్ఎస్ ఇంచార్జి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA  Kaushik Reddy) బహిర్గతం చేశారు.

దొంగ ఓట్లతో ఉప ఎన్నికలో గెలవాలని కాంగ్రెస్( Congress)అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదు చేయించాడని ఆరోపించారు. ఇటీవల నవీన్ యాదవ్ ఓటర్ కార్డులు పంచారని..అవి నకిలీ ఓటరు(fake voters) కార్డులు కావచ్చని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ..ఓవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ గగ్గోలు పెడుతుంటే..మరోవైపు తెలంగాణలో ఆ పార్టీ నాయకులు ఓటు చోరికి పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అడ్డదారిలో గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు ఎన్ని అక్రమాలకు పాల్పడినప్పటికి..ప్రజలు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాధ్ సతీమణి సునితను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.