Site icon vidhaatha

Kaleshwaram | కొనసాగిన కాళేశ్వరం విచారణ.. కమిషన్ ముందు హాజరైన సీడీవో ఎస్‌ఈ ఫజల్‌

డిజైన్ల లేని వాటికి ఆమోదం తెలిపిన పరిస్థితులపై ఏకరవు

Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (Medigadda), అన్నారం (Annaram), సుందిళ్ల (Sundilla)బ్యారేజీల నిర్మాణాల్లోని అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగంగా కొనసాగుతుంది. శుక్రవారం కమిషన్ ముందు నీటి పారుదల శాఖ సీడీవో ఎస్ఈ ఫజల్ (SE Fazal) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ వేసిన ప్రశ్నలకు జవాబుగా ఫజల్‌ పలు కీలక అంశాలను వెల్లడించారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ ఫైల్ కు వెళ్లాలని కాళేశ్వరం సీఈ చెప్పారని అలాగే సుందిళ్ల రెండో బ్లాక్-ఏ లో అదనపు 6 వెంట్లు డిజైన్ లో లేనప్పటికీ ఆ తర్వాత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో అదనపు వెంట్లు వేసినట్లు వివరించారు. క్రాస్ సెక్షన్స్ కాళేశ్వరం సీఈ నివేదిక మేరకు ఆమోదించినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే వాటిని ఆమోదించినట్లు వెల్లడించారు.

రెండో రోజు విచారణకు నరేందర్ రెడ్డి:

సీడీవో విశ్రాంత ఈఎన్‌సీ నరేందర్ రెడ్డి శుక్రవారం కూడా పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్నటి విచారణకు కొనసాగింపుగా ఇవాళ 2 లేఖలను కమిషన్ కు నరేందర్‌ రెడ్డి అందజేశారు. కాగా నిన్నటి విచారణలో డిజైన ఖరారు విషయంలో కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఒత్తిడి చేశారని సరేందర్ రెడ్డి కమిషన్ కు వివరించడం విచారణలో కీలకంగా మారింది.

Exit mobile version