విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాతా ఏప్రిల్ 11న సీబీఐ సైతం కవితను జైల్లో ఉండగానే అరెస్టు చేసింది. వంద రోజులకు పైగా కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు వరుసగా కోర్టుల్లో వీగిపోతుండటంతో జైలులోనే ఉండాల్సివస్తుంది.
KAVITHA | తీహార్ జైల్లో కవితకు అస్వస్థత ..దీన్ దయాల్ ఆస్పత్రికి తరలింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆమెను వైద్య చికిత్స కోసం దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు

Latest News
జపాన్ భాషలో పుష్ప 2 డైలాగ్..
200 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగం..! నేటి నుంచి ఈ నాలుగు రాశులకు స్వర్ణయుగమే..!!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కళ్యాణ యోగం..!
U19 ప్రపంచకప్ 2026: హెనిల్ పటేల్ అయిదు వికెట్లతో భారత్ ఘన విజయం
హర్లీన్ దియోల్ అద్భుత అర్ధ సెంచరీ – ముంబైపై యూపీ ఘన విజయం
విజయ్ ‘జన నాయగన్’కు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ
సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్
బడ్జెట్ 2026 : నిర్మలా సీతారామన్ ఏమివ్వనుంది?