Site icon vidhaatha

అబ‌ద్ధాల ప్రొఫెస‌ర్ కేసీఆర్‌

విధాత‌: క‌ల్వ‌కుంట్ల పేరు తీసి అబ‌ద్ధాల కేసీఆర్ అని పెట్టాల‌న్నారు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి. ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. కేసీఆర్ బాధ క‌రెంట్ గురించి కాదు ఆయ‌న‌కు పొలిటిక‌ల్ ప‌వ‌ర్ లేద‌న్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజ‌నం చేస్తుండ‌గా మూడు సార్లు క‌రెంట్ పోయిందంటే ఎవ‌రూ న‌మ్మ‌ర‌న్నారు. కేసీఆర్ రాష్ట్రం ఎప్పుడు విడిపోతే అప్పుడు సీఎం కావ‌ల‌నుకునే వార‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక ప్ర‌జ‌లు ఎలా జీవిస్తున్నార‌ని ఎప్పుడైనా కేసీఆర్ అడిగారా అని ప్ర‌శ్నించారు. నిజాల‌ను అబ‌ద్ధాలుగా మార్చ‌డం కేసీఆర్‌కు బాగా తెలుస‌న్నారు. అధికారంలో ఉన్న‌న్నాల్లు ప్ర‌జ‌లు గుర్తురాలేదు, అధికారం పోగానే ప్ర‌జ‌లు గుర్తొచ్చార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఆర్ పొలిటిక‌ల్ ప‌వ‌ర్ క‌ట్ చేశారు, గ‌త్యంత‌రం లేక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నార‌న్నారు. కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో ఏనాడైనా స‌చివాల‌యంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారా అని ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు కేసీఆర్ కు ట్విట్ట‌ర్ లేదు, ప్ర‌తిప‌క్షంలోకి రాగానే ట్విట్ట‌ర్ వ‌చ్చిందా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు.

జ‌గ్గారెడ్డి స‌మ‌క్షంలో చేరిక‌లు

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాగార్జ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు రాజ‌కీయ‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జ‌గ్గారెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభ‌వ‌న్‌లో వారికి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జ‌గ్గారెడ్డి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Exit mobile version