Site icon vidhaatha

Gandra Satyanarayana Rao | హామీలిచ్చి మోసం చేసిన కేసీఆర్: గండ్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కెసిఆర్ కు జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) విమర్శించారు.

భూపాలపల్లిలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చే అన్ని ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. అందుకు ఇటీవల విడుదలైన కర్ణాటక ఫలితాలే దీనికి నిదర్శనమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఇచ్చిన హామీలను అమలుపరచడంలో పూర్తిగా విఫలం చెందిందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో దేశంలో మార్పు మొదలైందని పేర్కొన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదన్నారు.

రాష్ట్రంలో ఏం ప్రగతి సాధించారని దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అధికారం చేపట్టేందుకు కృషి చేయాలని జీఎస్సార్ దిశా నిర్దేశనం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, స్టేట్ ఓబీసీ కో ఆర్డినేటర్ ఓరంగంటి శంకర్ గౌడ్, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్, పట్టణ కౌన్సిలర్‌తో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version