Site icon vidhaatha

చిన్నారి అక్షయకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం… అధైర్య పడొద్దు

– భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
– తల్లిదండ్రులతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడిన జిల్లా కలెక్టర్
– తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యశాఖాధికారులకు ఆదేశం

విధాత, వరంగల్ ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని ఎల్బీనగర్ కు చెందిన కాజ్ పేట నరేష్, సుమలత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత సంవత్సరం దీపావళి వేడుకలు సమయంలో తన అన్నయ్య టపాకాయలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న చిన్నారి అక్షయ (7) బట్టలకు అంటుకుని రెండు కాళ్లు, నడుం వరకు తీవ్రంగా
కాలి గాయపడింది. ఈ క్రమంలో తన కూతురును ఎంజిఎం ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. అక్షయ పూర్తిగా కోలుకోలేదని, రెండు కాళ్లలో ఒక కాలికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు తెలిపారని, దీనికి కనీసం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చిన్నారి తండ్రి నరేష్ చెప్పిన విషయమై పాపకు వైద్య సేవలపై స్పందించిన
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
తక్షణమే పాపకు వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారుల సలహా మేరకు ఇక్కడ సాధ్యపడకపోతే మెరుగైన వైద్య సేవలకు హైదరాబాద్ పంపిస్తామని పాప తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందిస్తామని దైర్యం కల్పించారు.

Exit mobile version