Site icon vidhaatha

Seethakka: మినీ మేడారం జాతర.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Seethakka:

విధాత ప్రత్యేక ప్రతనిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులలో అన్ని శాఖల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత సమయం లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ములుగు కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, క్రింది స్థాయి నుండి ఉన్నత అధికారుల వరకు ప్రతి పనిని పరిశీలించాలని సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న పనితో పాటు జిల్లా స్థాయిలో చేపడుతున్న పనులను సంబంధిత అధికారులు నిత్యం పరిశీలించి నాణ్యతతో కూడిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 100 కిలోమీటర్లు ఉండటం పాటు, గోదావరి పరిహక ప్రాంతం 100 కిలోమీటర్లు ఉందని, పలు ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల నుంచి చేపట్టిన పనులను నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.

ప్రస్తుత వేసవికాలంలో గ్రామాలలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు ప్రాణాలిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని దానికి అనుగుణంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఐటీడీఏ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న మహా మేడారం జాతరను పురస్కరించుకొని చేపట్టనున్న పనులపై అధికారులు అంచనాలు తయారు చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పలు రకాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని పక్షంలో చర్యలు తప్పవని, ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి తెలిపారు. వేసవి కాలం మూసే వరకు జిల్లాలోని పలు గ్రామాలకు పలు శాఖల ద్వారా చేపట్టిన పనులను రెండు నెలల కాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలలో మంచి నీటిని సరఫరా చేసే ట్యాంకులను శుభ్రం చేయాలని, గ్రామాలలోని చెరువు కుంటలలో నీరు లేని సమయంలో వాటికి అవసరమైన మరమ్మతులను చేపట్టాలని, ప్రతి చెరువు కుంటను సాగునీరు, త్రాగునీరుకు అనుకూలంగా ఉండే విధంగా పనులు చేయాలని మంత్రి అన్నారు. సమావేశంలో ఆర్డిఓ వెంకటేష్, ఆర్ అండ్ బి, పి.ఆర్, ట్రైబల్ వెల్ఫేర్, నేషనల్ హైవే, ఆర్ డ బ్లు ఎస్, ఇర్రిగేషన్ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version