టీడీఆర్ స్కామ్ లో కాంగ్రెస్ గద్దలు : కేటీఆర్

హైదరాబాద్‌లో TDR స్కామ్ పై కాంగ్రెస్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. GHMCలో టీడీఆర్ జారీ నిలిపి, వేల కోట్ల దందా జరుగుతుందని తెలిపారు.

KTR

విధాత, హైదరాబాద్ : అసలే డిమాండ్ లేక మూలుగుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని
కాంగ్రెస్ నేతలు తమ అవినీతితో ఉన్న ఊపిరి తీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటిందని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేల కోట్ల భారీ కుంభకోణం అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లోనే టీడీఆర్‌ల బ్లాక్ దందా కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో కొత్త టీడీఆర్‌ల జారీ నిలిపివేసి, కృత్రిమ కొరత సృష్టించి వేల కోట్లు దండుకుంటున్నారు కాంగ్రెస్ గద్దలు అని కేటీఆర్ ఆరోపించారు.

టీడీఆర్ లు దొరక్క..రియల్ ఎస్టేట్ మరింత పతనం

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కో టీడీఆర్ పై 22%తో దొరికిన సర్టిఫికెట్ ఇప్పుడు 55 నుంచి 60 శాతం చెల్లించిన దొరకడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కొత్త టీడీఆర్ లను జీహెచ్ఎంసీ పరిధిలో నిలిపివేయడం.. ఒకటి రెండు జారీ చేసిన అవి పెద్దలవే కావడంతో.. టీడీఆర్ సర్టిఫికెట్లను పొందడం చిన్నపాటి బిల్డర్లకు కష్టంగా మారిన పరిస్థితి. టీడీఆర్ లకు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని.. దీంతో వందల కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ లు నిలిచిపోయి నిర్మాణరంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. కొత్త టీడీఆర్ లు జారీ చేయవద్దని తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని అందుకే గతంలో మాదిరిగా జీహెచ్ఎంసీ టీడీఆర్ ల దరఖాస్తులు పరిశీలించడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తుంది.

 

Exit mobile version